తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానం

    హైదరాబాద్ : ప్రశ్నించే తత్వం నుంచే విజ్ఞానపు ఆలోచనలు వృద్ధి చెందుతాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మెన్ బీవీ రాఘవులు నొక్కి చెప్పారు. ప్రశ్నించని చోట విజ్ఞానం పురోగమించదనీ, ఆ తత్వాన్ని చంపేస్తే దేశం ముందుకు పోదని స్పష్టం చేశారు. దేశంలో అశాస్త్రీయ భావజాలం వేగంగా విస్తరిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఏఎస్రావు విజ్ఞాన వేదిక ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ హోమిజే బాబా కమ్యూనిటీ హాల్లో

    READ MORE
  • జగన్ కు నవ సందేహాలతో బహిరంగలేఖ రాసిన షర్మిల

    కడప:తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాం తరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? ఎస్సీ, ఎస్టీ పునరా వాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?

    READ MORE
  • రిమోట్ కంట్రోల్ గురించి జగన్ కే బాగా తెలుసు.. షర్మిల ఎద్దేవా

    కడప : ప్రధాని నరేంద్ర మోదీకి రిమోట్ కంట్రోల్ గా జగన్ వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వానికి అన్నింటా మద్దతు తెలుపుతున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిని రెండు రిమోట్ కంట్రోల్ లు నియంత్రి స్తున్నాయని, రెండు పేర్లూ ‘బి’ తోనే స్టార్ట్ అవుతాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో సీఎం ఇంట్లో మరొకరికి జగన్ రిమోట్ కంట్రోల్ గా ఉన్నారని.. వాళ్ల సూచనలను, కట్టడిని తప్పకుండా నడుచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ

    READ MORE
  • ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి

    తణుకు : పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో ఈనెల 3న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో హేమకుమారి ఒకరు కావడం విశేషం. ఉన్నత విద్యావంతురాలైన ఆమె మహిళల విద్య, వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై

    READ MORE
  • గోదావరిని చూసి పులకించా…

    ధర్మపురి : కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా గోదావరి నదిని చూసి పులకించిపోయానని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం మేడిగడ్డ, సుందిళ్ల జలాశయాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో పంపు హౌస్‌ ఒక్కో ప్రాజెక్టుతో సమానమని తెలిపారు. గత ప్రభుత్వాల  విధానాలను అనుసరించి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం 20-25

    READ MORE
  • తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

    హైదరాబాద్ : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం వాయు గుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో ఇది తీవ్ర వాయు గుండంగా మారే అవకాశం ఉందని, తదుపరి 48 గంటల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో

    READ MORE
  • కశ్మీర్‌ ను పాలస్తీనాలా చేస్తున్నారు

    న్యూఢిల్లీ: దేశంలో పరిపాలన నాజీలను తలపిస్తోందని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. లోక్ సభలో జమ్ము-కశ్మీర్ పునర్విభజన దీనిపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆ ముసాయిదాను వ్యతిరేకించారు. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని చెప్పారు. దేశంలో సమాఖ్య తత్వాతనికి అర్థం లేకుండా పోయిందని ఆక్రోశించారు. భారత్ కూడా చైనాలా మారుతోందని విమర్శించారు. నాజీ సిద్ధాంతాలను భాజపా అనుసరిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యానించారు. కశ్మీర్ ను పాలస్తీనాలా తయారు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు