పట్టపగలే చైన్ స్నాచింగ్

హొసూరు : స్థానిక ఆనంద్ నగర్‌లో నడిచి వెళుతున్న మహిళ మెడలోంచి ఆగంతకులు గొలుసును లాక్కుపోయారు. తిలకవతి అనే మహిళ పాఠశాలకు వెళ్లిన పిల్లలను ఇంటికి తీసుకు రావడానికి నడిచి వెళుతుండగా ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో ఉన్న అయిదు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. వెంటనే ఆమె కేకలు వేసింది. యువకులను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos