హొసూరులో జయలలిత వర్ధంతి

హొసూరు : రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి  జయలలిత వర్ధంతిని అన్నా డీఎంకే నాయకులు, కార్యకర్తలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. హొసూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు,  మాజీ మంత్రి ఇ. బాలకృష్ణా రెడ్డి అధ్యక్షతన స్థానిక బస్టాండులో జయలలిత చిత్ర పటం ఉంచి పూజలు నిర్వహించి, నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి జయలలిత ఎంతో కృషి చేశారని, పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. దివంగత జయలలిత ఆశయ సాధనకు అధికార పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

తాజా సమాచారం