కాలేజీ విద్యార్థినిలను వ్యభిచార కూపంలోకి లాగడానికి తరగతి గదుల్లోనే శృంగార పాఠాలు చెబుతూ మభ్య పెట్టడానికి ప్రయత్నించిన ఓ మహిళ లెక్చరర్ భాగోతం తమిళనాడు రాష్ట్రంలోని అరుప్పుకోటైలో వెలుగు చూసింది.అరుప్పుకోటై మహిళా కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న నిర్మలా దేవి మదురై కామరాజర్ యూనివర్శిటీలోని కొందరు పెద్దలకు లైంగిక సుఖం ఇస్తే మీకు పరీక్షలో ఎక్కువ మార్కులు వేసి పాస్ చేస్తారని కాలేజీకి వచ్చే అమ్మాయిలను మభ్య పెట్టడానికి ప్రయత్నించింది.అందుకు ప్రతిఫలంగా విలాసవంతమైన జీవితం గడపటానికి మీ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారని, ఈ విషయాలు చాలా రహస్యంగా ఉంటాయని అరుప్పుకోటై మహిళా కాలేజ్ అమ్మాయిలను మభ్య పెట్టి వ్యభిచారం కూపంలోకి నెట్టడానికి ప్రయత్నించింది.కాలేజ్ విద్యార్థులకు నిర్మలా దేవి సెక్స్ పాఠాలు చెప్పిన ఆడియో టేప్ లు బయటకు రావడంతో అవి వైరల్ అయ్యాయి. కాలేజ్ అమ్మాయి కొందరు దైర్యంగా ముందుకు వచ్చి నిర్మాలా దేవి భాగోతం మొత్తం పోలీసులకు చెప్పడంతో నిర్మాలాదేవితో పాటు మురుగన్, పీహెచ్ డీ విద్యార్థి కరుప్పస్వామిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ నిర్మలా దేవితో సహ ఈ కేసులో నిర్మలా దేవిని కాపాడటానికి చాల మంది పెద్దలు ప్రయత్నించారని అయితే రాష్ట్ర ప్రభుత్వం,గవర్నర్ సైతం దీన్నితీవ్రంగా పరిగణించడంతో వెనక్కి తగ్గినట్లు ఆరోపణలు వచ్చాయి.కేసుకు సంబంధించి శ్రీవిల్లిపుత్తూరు జిల్లా మహిళా కోర్టులో న్యాయమూర్తి కేసు విచారణ చేస్తున్న సమయంలో నిర్మలా దేవి కోర్టులో కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు, అక్కడే ఉన్న వారు నిర్మలా దేవికి ప్రాథమిక చికిత్స అందించారు.