హొసూరులో లాటరీ టికెట్ల విక్రేతల అరెస్టు

హొసూరు : పట్టణంలో ప్రభుత్వం నిషేధించిన లాటరీ టికెట్లను విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న లాటరీ టికెట్లను స్వాధీనపరచుకున్నారు. పట్టణంలో పలు చోట్ల లాటరీ టికెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారమందింది. దీంతో వారు గట్టి నిఘా పెట్టారు. బస్టాండు వద్ద ఎర్రప్ప అనే వ్యక్తి లాటరీ టికెట్లు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. హొసూరు-బాగలూరు రోడ్డు, తాలూకాఫీసు రోడ్లలో లాటరీ టికెట్లను విక్రయిస్తున్న మురుగన్, చంద్రు అనే ఇద్దిరిని కూడా పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారందరినీ కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos