హొసూరు : హోసూరు పారిశ్రామిక వాడలోని బేగేపల్లి గ్రామంలో నివాసముంటున్న ఓ వ్యక్తి కి వేరే జిల్లాకు చెందిన కరోనా వ్యాధి గ్రస్థుని ద్వారా వైరస్ సోకి ఉండవచ్చనే అనుమానంతో కృష్ణగిరి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసుల సహాయంతో ఆ వ్యక్తిని గుర్తించి క్వారంటైన్ కు తరలించారు. తరువాత బేగేపల్లి గోవిందాగ్రహారం,రాజేశ్వరి లేవుట్, చుట్టుపక్కల గ్రామాలను అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకొని ముందు జాగ్రత్త చర్యగా క్రిమిసంహారక మందులను పిచికారీ చేశారు. తరువాత బేగేపల్లి గ్రామవాసి ఎవరెవరితో తిరిగాడు అనే వివరాలను అతని ద్వారా అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గ్రామ ప్రజలకు వివరిస్తున్నారు.