చైనా ఆర్మీ అతి తెలివి..

చైనా ఆర్మీ అతి తెలివి..

ప్రపంచాన్ని మభ్య పెట్టడానికి చైనా చేయని ప్రయత్నం ఉండదు. వాస్తవాలను దాచడం, అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. లడఖ్ సరిహద్దులో భారత సైన్యం చేతిలో పరాభవం తిన్న అనంతరం ఈ తరహా విద్యకు మరింత పదును పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే.. ఈ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. చైనా కపట బుద్ధి ఏమిటో ప్రపంచానికి మరోసారి తెలిసింది.తన సైనిక శక్తిని ప్రపంచానికి తెలపడానికి చైనా తరచూ వీడియోలను విడుదల చేస్తుంటుంది. లడఖ్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ఇలాగే ఓ వీడియోను బయటకు వదిలింది. చైనా ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన ఆ వీడియోలో ఆ దేశ వైమానిక శక్తి గురించి గొప్పగా చెప్పారు. అయితే.. అదంతా వట్టి అభూత కల్పనేనని నెటిజన్లు తేల్చారు.చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) వాయుసేన ఇటీవల తమ అధికారిక వీబో హ్యాండిల్‌ ద్వారా ‘బాంబర్ ఎటాక్’ వీడియోను విడుదల చేసింది. హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ట్రాన్స్‌ఫార్మర్స్: రివెంజ్‌ ఆఫ్‌ ది ఫాలెన్‌, ది హర్ట్‌ లాకర్‌ సినిమాల్లో కొన్ని దృశ్యాలను చైనా వాయుసేన వీడియోలో తెలివిగా వాడుకున్నారు. ఈ విషయాన్ని హాంగ్‌కాంగ్‌కు చెందిన యాపిల్‌ డైలీ హెచ్‌కే బయట పెట్టింది. పీఎల్‌ఏఏఎఫ్‌ రిలీజ్‌ చేసిన వీడియోలోని దృశ్యాన్ని.. హాలీవుడ్ సినిమాలో దృశ్యాలను చూపిస్తూ ట్వీట్ చేసింది. ఇప్పుడిది వైరల్‌గా మారింది.చైనీస్ హెచ్-6 బాంబర్లు అమెరికాకు చెందిన ఓ స్థావరంపై క్షిపణి దాడి చేస్తున్నట్లు మరో వీడియోలో చూపించారు. దీన్ని పీఎల్‌ఎల్‌ఏఏఎప్‌ తన అధికారిక వీబో హ్యాండిల్‌ ద్వారా షేర్ చేసింది. అయితే.. హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్‌గా చూసే వారు చైనా మోసాన్ని ఇట్టే పసిగడతారు. హర్ట్ లాకర్, ట్రాన్స్ఫార్మర్స్: రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్, ది రాక్ లాంటి సినిమాల నుంచి కొన్ని క్లిప్పింగులను తీసుకొని ‘బాంబర్‌ అటాక్‌’ వీడియోలో కాపీ కొట్టినట్లు సదరు దృశ్యాలను గమనిస్తే అర్థమవుతోంది. హాలివుడ్‌ సినిమాల్లో నుంచి కాపీ కొట్టిన దృశ్యాలతో చైనా రూపొందించిన వీడియోలోని దృశ్యాలను సరిపోల్చుతూ నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos