హొసూరులో రోడ్డు భద్రతా వారోత్సవాలు

హొసూరు : హొసూరు ఆర్టీవో కార్యాలయం ఆధ్వర్యంలో 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆర్టీవో కార్యాలయం సమీపంలోని కళ్యాణ మండపంలో డ్రైవర్లకు ఉచితంగా నేత్ర చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హొసూరు ఆర్టీవో ఈశ్వరమూర్తి అధ్యక్షత వహించగా, హొసూరు డీఎస్‌పీ సంఘ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల బస్సులు, కార్లు, లారీలు లాంటి భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు తప్పక కంటి

పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచించారు. దీని వల్ల ప్రమాదాలు నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos