బలపరీక్ష నిర్వహించండి

బలపరీక్ష నిర్వహించండి

చండీగఢ్: బీజేపీ పాలిత హర్యానాలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించటంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్కు లేఖ రాశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ లేకపోతే హర్యానాలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేశారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కాంగ్రెస్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ మాజీ మిత్రపక్షమైన దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. ‘రెండు నెలల కిందట ఏర్పడిన ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో ఉంది. ఎందుకంటే వారికి మద్దతిచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు బీజేపీ నుంచి, మరొకరు స్వతంత్ర ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అలాగే బీజేపీకి మద్దతు ఇస్తున్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలా? వద్దా? అన్నది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకోవాలి’ అని ఆయన అన్నారు.

తాజా సమాచారం