అమరావతి : ‘వెలుగు’ వీవోఏల గౌరవవేతనాన్ని రూ.10 వేలకు పెంచి ప్రభుత్వం సోమవారం ఇక్కడ ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఇందువల్ల రాష్ట్రంలోని 27,297 మంది వెలుగు వీవోఏలకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం రూ.8 వేలు, గ్రామ సంఘాలు, రూ.2 వేలు వంతున వారికి వేతనాన్ని చెల్లించనున్నారు. వచ్చే నెల నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానుంది.