వైభవంగా చండ్రచూడేశ్వర రథోత్సవం

హొసూరు : ఇక్కడి తేరుపేట కొండపైన నెలకొన్న అతి పురాతన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన మరకత సమేత శ్రీ చంద్ర చూడేశ్వరస్వామి రథోత్సవం అతి వైభవంగా జరిగింది. వారం రోజుల కిందట ధ్వజారోహణంతో చంద్రచూడేశ్వర స్వామి రథోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. స్వామి వారికి వివిధ రకాల పూజలు, అభిషేకాలు నిర్వహించి మరకత సమేత చంద్రచూడేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సింహ వాహనంపై ఊరేగించి, ఉయ్యాల సేవ నిర్వహించారు. సోమవారం పౌర్ణమి కావడంతో చంద్రచూడేశ్వర స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రథంలో ఆసీనులనుజేసి, విశేష పూజలు నిర్వహించి వేల మంది భక్తులు రథాన్ని లాగారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు రథోత్సవంలో పాల్గొని  స్వామివారికి విశేష పూజలు నిర్వహించడమే కాకుండా పచ్చ కొలను నీటిలో ఉప్పు పోసి తమ కష్టాలు తీర్చాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు.  అనంతరం రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని వేల మంది భక్తులు తరలి రావడంతో హొసూరు పుర వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos