హొసూరు : ఇక్కడికి సమీపంలో కొబ్బరికాయల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కృష్ణగిరి జిల్లా కెలమంగలం సమీపంలోని యడవన హళ్లి గ్రామానికి చెందిన సాకప్ప(65) కొబ్బరికాయలు వ్యాపారం చేస్తూ, చీటీలు నడుపుతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు సాకప్ప ఇంట్లోకి చొరబడి వేట కొడవలితో నరికారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సాకప్పను స్థానికులు హొసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక ఆయన మరణించాడు. ఈ సంఘటనపై రాయకోట పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. దుండగుల ఆచూకీని కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.