గృహ ప్రవేశానికి వచ్చి…

  • In Crime
  • January 30, 2020
  • 206 Views

హొసూరు : ఇక్కడికి సమీపంలో బంధువుల గృహ ప్రవేశానికి వస్తున్న బెంగళూరు దంపతులు రోడ్డు ప్రమాదానికి గురై ఘటనా స్థలంలోనే మరణించారు. బెంగళూరు ఈజీపురకు చెందిన మునికృష్ణ, భార్య సంతోషమ్మలు హొసూరు సమీపంలోని డి.కొత్తపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మత్తిగిరి వద్ద టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన దంపతులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మత్తిగిరి పోలీసులు దంపతుల శవాలను స్వాధీనపరచుకుని హొసూరు ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం