తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

 • 7 అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు మంత్రివర్గ నిర్ణయం

  అమరావతి: ఇక్కడ సొమవారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు అంశాలను ఆమోదించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు… *మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ *ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు *ఏప్రిల్ నుంచి వర్తించేలా రూ.4 వేల పెన్షన్ పెంపు. బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేల పెన్షన్ వితరణ. *అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన. *గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో మంత్రివర్గ

  READ MORE
 • నేను తక్కువ మాట్లాడతా… మీకు ఎక్కువ అవకాశం ఇస్తా

  అమరనావతి: శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు హుందాతనం అవసరం అని స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైతే శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని అన్నారు. సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచించారు. శాసనసభ కార్యకలాపాలను రాష్ట్ర ప్రజలంతా చూస్తారని, 16వ శాసనసభకు గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యేలందరూ సహకరించాలని స్పీకర్ హోదాలో అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. “ప్రజలు మనకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. ఈ సభలో చాలా

  READ MORE
 • చంద్ర‌న్న ప్రజాస్వామ్యవాదా..? విధ్వంసకారుడా..?

  తాడేపల్లి: నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు శనివారం ఉదయం కూల్చివేసారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికలో స్పందించారు.”సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీసు కూల్చడమే ముఖ్యమని భావించిన చంద్రన్న ప్రజాస్వామ్యవాదా..? విధ్వంసకారుడా..?” అంటూ ట్వీట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, విధ్వంసమేనని ఆయన విమర్శించారు. దీనికి తాడేపల్లిలో నిర్మాణాన్ని బుల్డోజర్లు కూల్చివేస్తున్న వీడియోను జత

  READ MORE
 • స్పీకర్ గా బాధ్యతలు స్పీకరించిన అయ్యన్న పాత్రుడు

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం సభలో ప్రకటించారు. సభ్యుల అభినందనల మధ్య అయ్యన్న పాత్రుడు స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అయ్యన్న పాత్రుడిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు స్పీకర్ సీటులో కూర్చుండబెట్టారు. కాగా, సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, స్పీకర్ పదవికి తనను ప్రతిపాదించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి

  READ MORE
 • కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు

  న్యూ ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో అరెస్టై, తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం మరోసారి పొడిగించింది. కవిత కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగించింది. ఈరోజు కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సీబీఐ ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో కవితను మార్చిలో ఈడీ అధికారులు

  READ MORE
 • తెలంగాణలో మూడురోజుల పాటు భారీ వర్షాలు

  హైదరాబాదు: తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.ఆదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 కిలో మీటర్ల

  READ MORE
 • బీఆర్ఎస్ కు షాకిచ్చిన పోచారం

  హైదరాబాదు:బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి.. పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చెప్పారు. రైతుల సంక్షేమానికి

  READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు