సింహానికి పంజా రుచి చూపిన పులి

అడవిలో సింహం పులిపై దాడికి దిగడం సహజం. కానీ పులి సింహంపై ఎదురు దాడికి దిగితే ఎలా ఉంటుంది. గడ్డి మైదానంలో పులి, సింహాలు ఇతర జంతువులతోపాటు సేదతీరుతున్నాయి. ఈ క్రమంలో ఓ సింహం ఒక్కసారిగి అక్కడున్న పులిపై దాడి చేసి దానిమెడపై కొరికింది. దీంతో పులి ఒక్క ఉదుటున లేచి  సింహం ముఖం మీద దాడి చేసింది. దీంతో బెదిరిపోయిన సింహం ఏమీ చేయలేక అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయింది. ఈ వీడియోను అటవీశాఖ అధికారి సుశాంత్‌ నందా ఆదివారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ‘పులి బలమైనది.. సింహం కౄరమైనది. సింహం ఎప్పుడూ ఓటమిని అంగీకరించదు. చనిపోయే వరకు పోరాడుతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos