హొసూరును ఆవరించిన పొగ మంచు

హొసూరు : దట్టమైన పొగమంచు కారణంగా హొసూరు ప్రాంతంలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల కిందట ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు పడ్డాయి. అప్పటి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. గత కొద్ది రోజులుగా చలితో పాటు పొగమంచు కూడా ఎక్కువ కావడంతో ఉదయం పూట వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు నడపడానికి జంకుతున్నారు. కార్మికులు, విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతం. శుక్రవారం ఉదయం దట్టంగా పొగ మంచు ఆవరించడంతో వాహన చోదకుల

అవస్థలు రెండింతలయ్యాయి.

తాజా సమాచారం