యువకుని దారుణ హత్య

హొసూరు : ఇక్కడికి సమీపంలోని కర్నూరు వద్ద ముళ్ళ పొదల్లో దారుణ హత్యకు గురైన  యువకుడి శవాన్ని మత్తిగిరి పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ముళ్ల పొదల నుంచి దుర్వాసన రావడంతో పశువుల కాపరులు అటు వైపు వెళ్ళి చూశారు. ఓ యువకుని శవం కనిపించడంతో స్థానికుల సహాయంతో మత్తిగిరి పోలీసులకు సమాచారం అందించారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పొదల్లో నుంచి శవాన్ని వెలుపలికి తీసి విచారణ చేపట్టారు. ఎవరో యువకుని గొంతు కోసి దారుణంగా హత్య చేసి శవాన్ని పొదల్లో పడేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. హతుడు ఉత్తర భారత దేశానికి చెందినవాడై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ధరించిన దుస్తులలో ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. శవాన్ని హొసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos