వైభవంగా శ్రీకృష్ణాలయ కుంభాభిషేకం

హొసూరు : హొసూరు సమీపంలోని కాటినాయనపల్లి గ్రామంలో పురాతన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయ కుంభాభిషేక కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించారు. మొదటిరోజు గణపతి పూజ తో కుంభాభిషేక కార్యక్రమం  పూజలు ప్రారంభమయ్యాయి. రెండవ రోజు ఆలయంలో గణపతి హోమం కలశ స్థాపన, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి విశేష పూజలు నిర్వహించారు. మూడవ రోజు కుంభ హోమం,  శాంతి హోమం, మహా పూర్ణాహుతి హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. తరువాత పుణ్య నదీ జలాలతో అభిషేకం చేసి వేద పండితులు, మంగళ వాయిద్యాల మధ్య కుంభాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి విశేష పూజలు, దీపారాధన, మహా మంగళ హారతి కార్యక్రమం నిర్వహించారు. తరువాత తీర్థ ప్రసాద వినియోగం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos