తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

 • అంచెట్టిలో మంచి దొంగలు

  హోసూరు : దొంగల్లో కూడా మంచి దొంగలు కూడా ఉంటారనే చెప్పుకోవాలి. టాస్మాక్ దుకాణంలో దొంగిలించిన మద్యం బాటిళ్లను గుట్టు చప్పుడు కాక వారం రోజుల తరువాత తిరిగి దుకాణం ముందు ఉంచి వెళ్లిన సంఘటన దీనికి నిదర్శనం. వివరాల్లోకి వెళితే… కృష్ణగిరి జిల్లా అంచెట్టిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వారం రోజుల కిందట రూ.లక్షకు పైగా విలువ చేసే 16 బాక్సుల్లో ఉన్న మద్యం బాటిళ్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ సంఘటనపై

  READ MORE
 • కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది?

  హైదరాబాదు: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో బహిర్గతం చేసేందుకు చర్యల్ని తీసుకోవాలని కోరతూ నవీన్ (తీన్మార్ మల్లన్న) శుక్రవారంఇక్కడి ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ‘గత కొంత కాలంగా కేసీఆర్ కనిపించడం లేదు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. నిజాలు తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నార’నివ్యాజ్యంలో పేర్కొన్నారు. విచారణ చేసిన న్యాయస్థనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ గిమ్మిక్కులు చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించలేమని తెలిపింది.

  READ MORE
 • సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు బ్రేక్‌

  హైదరాబాదు : సచివాలయం కూల్చి వేత పనుల్ని వచ్చే సోమవారం వరకూ నిలిపేయాలని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఆచార్య పి.ఎల్.విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి ఈ మేరకు ఆదేశాల్ని ఇచ్చింది. ‘ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూల్చివేత పనులను కొన సాగిస్తున్నారు. భవనాల కూల్చివేతతో వాతా వరణం కాలుష్య మవుతోంది. మున్సిపల్, ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ నిబంధనల గురించి పట్టించు కోవడం లేద’ని వ్యాజ్యంలో తప్పు బట్టారు.

  READ MORE
 • కరోనా పీడిత ప్రాంతంగా తిరుమల

  తిరుమల : కరోనా కేసులు పెరుగుతున్నందున తిరుమలను వ్యాధి పీడిత ప్రాంతంగా ప్రకటించారు.అయినా ఆలయం తెరిచే ఉంటుందని వివరించారు. లాక్డౌన్ తర్వాత ఆలయాన్ని తెరిచి నేటికి సరిగ్గా నెల. మొదట్లో రోజుకు కేవలం 6,000 మంది భక్తుల ప్రవేశానికే ఆలయ పాలక మండలి అనుమతించింది. ఇప్పుడు ఆ సంఖ్యను 12,000 మందికి పెంచింది.

  READ MORE
 • పవర్‌ స్టార్‌ పోస్టర్‌

  హైదరాబాదు: రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న తాజా సినిమా-పవర్ స్టార్ పోస్టర్ గురువారం విడుదలైంది. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. ఈ సినిమా త్వరలోనే ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో విడుదల కానుంది. జై పవర్ స్టార్’ అని పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాతి కథ అని దానిపై రాసారు. పోస్టర్లో పవర్ స్టార్ పాత్రధారి అచ్చం జనసేన అధినేత పవన్ కల్యాణ్లా

  READ MORE
 • మూగబోయిన ప్రజా గళం

  హైదరాబాదు : ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజా వాగ్గేయకారుడు, ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ నేత మహ్మద్ నిస్సార్ బుధవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధ సమస్యతో ఇక్కడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిస్సార్ తొలుత ఎన్నో ప్రైవేటు ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా చేర్చుకో లేదు. చివరికి గాంధీలో చేరితే వెంటిలేటర్ లేక చనిపోయినట్లు ఇయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండాల మండలం

  READ MORE
 • బాలకృష్ణకు ప్రధాన విలన్ గా సంజయ్ దత్?

  హైదరాబాదు: బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం లో ప్రతినాయకుడుగా సంజయ్ దత్ కూడా నటించనున్నారని సమాచారం. బోయపాటి సినిమాల్లో ప్రతినాయకుల పాత్రం కొత్త తరహాలో సాగుతుంది. ఈ చిత్రంలో ఇద్దరు విలన్లున్నారు. ఒక పాత్రకు నటుడు సంజయ్ దత్ ను ఎంపిక సారు. దీనికి సంజయ్ సానుకూలంగా స్పందించాడని తెలిసింది.

  READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు