సిరా కర్మాగారంలో అగ్ని ప్రమాదం

సిరా కర్మాగారంలో అగ్ని ప్రమాదం

బెంగళూరు : ఇక్కడి బన్నేరుఘట్ట రోడ్డులోని శ్రీకలర్స్‌ సిరా కర్మాగారంలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. రూ.కోటి విలువైన ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ప్రమాదంలో రెండు టెంపోలు, రెండు బైక్‌లు, వ్యాగనార్‌ కారు దగ్ధమయ్యాయి. నందిని పాల ప్యాకెట్లపై ముద్రణకు ఈ కంపెనీలో ఉత్పత్తయ్యే సిరాను వినియోగిస్తారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఫ్యాక్టరీ పని చేయడం లేదు. అందులో నిల్వ ఉంచిన రసాయనాలకు విద్యుత్‌ స్పర్శ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. పెద్ద శబ్దంతో అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల కాసేపు ఆందోళన నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా పరిసరాల్లోని ఇళ్లలోని వారిని బయటకు రప్పించారు. ఫ్యాక్టరీలోని సిరా పీపాలు, ఓ వాహనం కూడా మంటల్లో కాలిపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos