హొసూరు : ఇక్కడికి సమీపంలోని మత్తిగిరిలో గల శ్రీ మహాలక్ష్మి దేవాలయ సువర్ణోత్సవాలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు, హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కన్యాదానం చేశారు. అనంతరం లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర స్వామికి కల్యాణోత్సవం నిర్వహించారు. చివరగా తలంబ్రాల కార్యక్రమం మహా మంగళ హారతి నిర్వహించి తీర్థ ప్రసాద వినియోగం చేశారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.