బ్యాలెట్ బాక్సులలో అభ్యర్థుల భవితవ్యం

హొసూరు : తమిళనాడులో రెండు విడతల స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడంతో అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. డిసెంబరు 27, 30 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. కృష్ణగిరి జిల్లాలో 10 యూనియన్లకు ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీ అధ్యక్ష, జిల్లా, యూనియన్ కౌన్సిలర్‌, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు  పెద్ద సంఖ్యలో బరిలో దిగారు. ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలలో ఉంచి భద్రతను కట్టుదిట్టం చేశారు. జనవరి 2న ఓట్ల లెక్కింపు చేపడతారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos