కాలభైరవ ఆలయంలో వైభవంగా అష్టమి పూజలు

హొసూరు : ఇక్కడికి సమీపంలోని మోరణపల్లి గ్రామంలో గల కాలభైరవేశ్వర ఆలయంలో అష్టమి పూజలను వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష పూజలు, దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో  హోమాది కార్యక్రమాలను నిర్వహించి స్వామివారికి నైవేద్యం పెట్టారు. చివరగా స్వామివారికి కర్పూర హారతినిచ్చి భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు. అష్టమి పూజలో భాగంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కాలభైరవునికి విశేష పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు.

తాజా సమాచారం