రిగ్గింగ్‌ వల్లే వంద శాతానికిపైగా ఓటింగ్‌

రిగ్గింగ్‌ వల్లే వంద శాతానికిపైగా ఓటింగ్‌

న్యూ ఢిల్లీ : త్రిపురలోని పశ్చిమ త్రిపుర లోక్సభ నియోజకవర్గంలో, రామ్నగర్ శాసనసభ స్థానంలో ఈనెల 19న జరిగిన పోలింగ్లో వంద శాతానిపైగా పోలింగ్ నమోదుకావడంపై సిపిఎం విస్మయం వ్యక్తం చేసింది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. స్వేచ్ఛగా, న్యాయంగా ఈ ఎన్నికలు జరగలేదని సిపిఎం త్రిపుర శాఖ కార్యదర్శి జితేంద్ర చౌదరి విమర్శించారు. మజ్లిస్పూర్ సెగ్మెంట్లో 105.30 శాతం, ఖాయర్పూర్లో 100.15 శాతం, మోహన్పూర్ సెగ్మెంట్లో 109.09 శాతం పోలింగ్ నమోదైంది. ”పశ్చిమ త్రిపుర లోక్సభ నియోజకవర్గానికి ఎన్నికలు, అదే పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన రామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక స్వేచ్ఛగా, న్యాయంగా, సాధారణ పద్ధతిలో జరగలేదని పై రికార్డులు రుజువు చేస్తున్నాయి. బూత్లను స్వాధీనం చేసుకున్నప్పుడు, వ్యవస్థీకృత పద్ధతిలో పూర్తిగా రిగ్గింగ్ చేసినప్పుడే ఇటువంటి సరిపోలని పోలింగ్ శాతం జరుగుతుంది” అని విమర్శించారు.
”రిటర్నింగ్ అధికారి కార్యాలయం ద్వారా పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ రిపోర్టుల నుండి డేటా సేకరించాం. రిటర్నింగ్ అధికారికి ప్రిసైడింగ్ అధికారి రిపోర్టును అందించే పోలింగ్ స్టేషన్ల వారీ డేటా పబ్లిక్గా అందు బాటులో లేనప్పటికీ, డిమాండ్ను బట్టి దాన్ని యాక్సెస్ చేయవచ్చు. అలానే వివరాలు తీసుకున్నాం” అని ఆయన తెలిపారు.
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మళ్లీ ఎన్నికలను నిర్వహిం చాలని సిపిఎం, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ నారాయణ్కర్ మాట్లాడుతూ త్రిపుర పశ్చిమ లోక్సభ సీటు, రామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సక్రమంగా పోలింగ్ నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని విమర్శించారు. పెద్ద ఎత్తున నకిలీ ఓటింగ్ జరిగిందని, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోకుండా అధికార పార్టీ గూండాలు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేత సుదీప్ రారు బర్మన్ విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos