రాహుల్‌ రథసారధిగా ప్రియాంకా గాంధీ

రాహుల్‌ రథసారధిగా ప్రియాంకా గాంధీ

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ జాతీయప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్బరేలీలో రాహుల్ గాంధీ, అమేథీలో కేఎల్ శర్మకు రాజకీయ రథసారధిగా మారనున్నారు. ఎన్నిలకు దూరంగా ఉన్న ఆమె.. రెండు స్థానాల్లో రాహుల్, శర్మ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి.. ప్రచారంపై దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయ్బరేలీలో, అమేథిలో కేఎల్ శర్మ నామినేషన్ల చివరి రోజున అధికారులకు నామపత్రాలు అందజేశారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రస్తుతం రెండు లోక్సభ సీట్ల బాధ్యతలను ఆమెకు పార్టీ అప్పగించింది.
40 మంది బృందంతో రాయ్బరేలీకి..
అయితే, ఇప్పటి వరకు అధికార కార్యక్రమాల షెడ్యూల్ను విడుదల చేయలేదు కానీ.. ప్రియాంకా గాంధీ 40 మంది సభ్యుల బృందంతో రాయ్బరేలీకి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ఆమె బృందం వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. సమాచారం ప్రకారం.. ప్రియాంక గాంధీ సామాజిక న్యాయం అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉన్నది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వివరాలు సేకరించినట్లు తెలుస్తున్నది. కాగా, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా సంబంధాలున్న వ్యక్తుల ఇండ్లను ప్రియాంక సందర్శించనున్నట్లు తెలుస్తున్నది. రాయ్బరేలీలోని అతిథి గృహంలో ఆయన బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. బూత్ల వారీగా వ్యూహరచన, సోషల్ మీడియాపై సైతం దృష్టి సారించనున్నారు. రాయ్బరేలీ, అమేథీ బూత్ల వారీగా ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం రెండు లోక్సభ నియోజకవర్గాల కమిటీల జాబితాను పార్టీ ఆదివారం ప్రియాంక బృందానికి అందజేసింది. రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి అన్ని కమిటీలకు కూడా అప్రమత్తంగా ఉండాలని సందేశం వెళ్లింది. సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ఆమె పర్యవేక్షించనున్నారు.
వ్యూహాలను సిద్ధం చేయనున్న టీమ్
ఈ బృందంలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ని పర్యవేక్షిస్తూ.. కార్యకలాపాలకు వ్యూహాలను సిద్ధం చేసేందుకు నిపుణలు బృందంలో ఉన్నారు. ప్రియాంక గాంధీ సూచనల మేరకు ఈ వ్యూహాన్ని సిద్ధం చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ వేళల్లో వివిధ సంస్థలకు చెందిన వ్యక్తులతో సంభాషించనున్నారు. రాయ్బరేలీతో పాటు అమేథీలోని వివిధ సామాజిక సంస్థల జాబితాను కూడా సేకరించారు. బార్ అసోసియేషన్లు, మహిళా సంఘాలతోనూ సంభాషించనున్నారు. రాయ్బరేలీతో పాటు ప్రియాంక వివిధ రాష్ట్రాల్లోనూ ప్రచారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితర నేతలతో టచ్లో ఉంటూ ప్రచారం నిర్వహించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos