బంగారం కొనలేని స్థితిలో మహిళలు

బంగారం కొనలేని స్థితిలో మహిళలు

పాట్నా: భారీగా పెరుగుతున్న ధరలతో దేశంలో అనేక మంది మహిళలు బంగారం కొనలేని స్థితిలో ఉన్నా రని, ఇక ‘మంగళసూత్రాలు’ గురించి మాట్లాడం ఎందుకని ప్రధానమంత్రి మోడీని ఆర్జేడీ నాయకులు తేజస్వియాదవ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల నుంచి మంగళసూత్రాలను కూడా లాగివేసుకుంటుందని మోడీ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ తేజస్వి యాదవ్‌పై విధంగా స్పందించారు. పాట్నాలో విలేకరులతో తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ.. ‘కోవిడ్‌ మహమ్మారి సమయంలోనూ, నోట్ల రద్దు తరు వాత, పుల్వామా ఉగ్రదాడి, సరిహద్దుల్లో ఘర్షణల కారణంగా అనేక మంది మహిళల మంగళసూత్రాలు తెగి పడ్డాయి. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారో ప్రధానమంత్రి మాకు చెప్పాలి’ అని అన్నారు. ‘ఎన్నికలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉండాలి. అధిక ధరలతో బంగారం మహిళలు కొనలేని విధంగా మారినప్పుడు ‘మంగళసూత్రం’ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు’ అని కూడా యాదవ్‌ అన్నారు. బీహార్‌లో రెండో దశ ఎన్నికలు జరుగుతున్న మొత్తం ఐదు స్థానాలను ఆర్జేడీ, దాని మిత్ర పక్షాలు గెలుచుకుంటాయని తేజస్వి యాదవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా వేదిక మధ్యే జరుగుతున్నాయని అన్నారు. ‘ఒక వైపు రాజ్యాంగానికి ముప్పు తెచ్చే ఎన్డీఏ, మరోవైపు రాజ్యాంగాన్ని రక్షించాలని అనుకుం టున్న ఇండియా వేదిక. మీరు ఇండియాను లేదా ఎన్డీఏను ఒక్కదాన్నే ఎన్నుకోవాలి’ అని తెలిపారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో పూర్నియా స్థానం నుంచి ఇండిపెండెం ట్‌గా పోటీ చేస్తున్న రాజేష్‌ రంజన్‌ అలియాస్‌ పప్పు యాదవ్‌ ను బీజేపీ బీ-టీమ్‌గా తేజస్వి యాదవ్‌ విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos