గరిష్ట స్థాయికి చేరిన కుటుంబ అప్పు

గరిష్ట స్థాయికి చేరిన కుటుంబ అప్పు

న్యూఢిల్లీ : భారతదేశంలో కుటుంబ అప్పులు ఆల్టైమ్ గరిష్టస్థాయికి చేరాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023- 24 మూడవ త్రైమాసికంలో (Q3) భారతదేశ కుటుంబ అప్పులు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో ఆల్టైమ్ గరిష్ట స్థాయి 39.1 శాతానికి చేరుతుందని అంచనావేసింది. ఇది 2020 – 21 నాలుగవ త్రైమాసికంలో ( Q4 )లో నమోదైన గరిష్ట స్థాయి 38.6 శాతం కన్నా ఎక్కువ. 2023-24 Q3లో వార్షిక ప్రాతిపదికన కుటుంబ అప్పు 16.5 శాతానికి పెరిగిందని అంచనా వేయబడింది. అయితే గృహేతర రుణంలో వేగంగా వృద్ధి చెందడం ద్వారా ఎక్కువగా పెరుగుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషణ వెల్లడించింది.
పెరుగుతున్న గృహ రుణాలు కార్పోరేట్ రుణాల పెరుగుదలకు విరుద్ధంగా ఉంది. ఇది 2023- 24 మూడవ త్రైమాసికంలో ఇవి కేవలం ఏడాదికి 6.1 శాతం పెరిగాయని అంచనా వేయబడింది. అదే సమయంలో జిడిపిలో 15 ఏళ్ల కనిష్ట స్థాయి 42.7 శాతానికి తగ్గింది. అనేక తక్కువ- ఆదాయ కుటుంబాలు కరోనా మహమ్మారి బారిన పడి తప్పనిసరిగా రుణాలు తీసుకోవలసి రావడంతో 2020- 21 చివరినాటికి కుటుంబ అప్పులు భారీగా పెరిగాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కుటుంబ అప్పులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కుటుంబ రుణాలు తీసుకున్న కుటుంబాలు అధిక పరపతిని పొందుతాయని పలువురు నిపుణులు సూచించినప్పటికీ, కుటుంబేతర రుణాలు వేగంగా పెరుగుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ కంపెనీకి చెందిన ఆర్థికవేత్త నిఖిల్ గుప్తా సూచించారు. ఉదాహరణకు డిసెంబర్ 2023 త్రైమాసికంలో కుటుంబేతర రుణం 18.3 శాతం పెరిగింది. కుటుంబ అప్పు 12.2 శాతం పెరిగాయి. కుటుంబేతర రుణాల వాటా మొత్తం కుటుంబ అప్పులో 72 శాతంగా ఉంది. 2020-21 నాలుగవ త్రైమాసికంలో, కరోనా మహమ్మారి అధికంగా ఉన్న సయమంలో, లాక్డౌన్ కారణంగా దేశ జిడిపి 3.5 శాతం వద్ద నెమ్మదిగా వృద్ధి చెందింది. 2023- 24 మూడవ త్రైమాసికం లో ఇది 8.4 శాతానికి పెరిగింది. అనుకూలమైన ప్రభావం ఉన్నప్పటికీ .. కుటుంబ అప్పు కూడా జిడిపిలో వాటాగా పెరగడం ఆందోళనకరం.
డిసెంబర్ 2023 త్రైమాసికంలో అంచనా వేసిన కార్పోరేట్ రుణాల పెరుగుదల 2023-24 లో రెండవ త్రైమాసికం నివేదించిన వార్షిక పెరుగుదల 5.5 శాతం దాదాపు బలహీనంగా ఉంది. 2022- 23 మూడవ త్రైమాసికం లో నివేదించిన వార్షిక పెరుగుదల 10 శాతం కంటే నెమ్మదిగా ఉంది. 2023-24 మూడవ త్రైమాసికంలో ప్రభుత్వేతర, ఆర్థికేతర రుణాల్లో దాదాపు 70 శాతం వృద్ధిని కుటుంబ అప్పు ఉందని మోతీలాల్ విశ్లేషణ చూపుతోంది. రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) డేటా ప్రకారం.. 2021- 22 లో 7.2 శాతం నుండి 2022- 23 లో కుటుంబాల నికర ఆర్థిక పొదుపులు దాదాపు ఐదు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయిందని సెప్టెంబర్ 19, 2023లో FE నివేదిక ప్రకటించింది. తీవ్రమైన ఆదాయం సంక్షోభం, మహమ్మారి అనంతరం వినియోగంలో పెరుగుదల అస్థిరతకు కారణమని ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos