ప్రబీర్‌ పురకాయస్థ చార్జిషీటుపై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు

ప్రబీర్‌ పురకాయస్థ చార్జిషీటుపై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు

న్యూ ఢిల్లీ : ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్, ఆ సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ దాఖలు చేసిన చార్జ్షీట్ను మంగళవారం ఢిల్లీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ఎనిమిది మంది రక్షిత సాక్షులు ఉన్నారని పోలీసుల తరపున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖండ్ ప్రతాప్ సింగ్ కోర్టుకు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో పలువురి పేర్లు బయటపడ్డాయని అన్నారు. యుఎపిఎ చట్టం కింద ప్రబీర్ పురకాయస్థను విచారించేందుకు అనుమతి కోసం ఢిల్లీపోలీసుల ప్రత్యేక సెల్ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు సంస్థ అందించిన సాక్ష్యాలను అధికారులు పరిశీలించిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తోందని అన్నారు. పాటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి హర్దీప్ కౌర్ తదుపరి విచారణను మే 31కి వాయిదా వేశారు.గతేడాది అక్టోబర్ 3న న్యూస్క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ, హ్యూమన్ రీసోర్సెస్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్ట్ చేసిన ఆరు నెలల తర్వాత ఈ ఏడాది మార్చి 30న పోలీసులు చార్జిషీటు నమోదు చేయడం గమనార్హం. గతేడాది డిసెంబర్ నుండి ఈ ఏడాది మార్చి వరకు చార్జ్షీటు నమోదు చేసేందుకు కోర్టు మూడు సార్లు గడువును పొడిగించింది. అయితే ఈ ఏడాది జనవరిలో అమిత్ చక్రవర్తి అప్రూవర్గా మారారు. పొ

తాజా సమాచారం

Latest Posts

Featured Videos