రిజ‌ర్వేష‌న్ల‌పై క‌ర్పూరీ ఠాకూర్‌తో విభేదిస్తున్న మోదీ

రిజ‌ర్వేష‌న్ల‌పై క‌ర్పూరీ ఠాకూర్‌తో విభేదిస్తున్న మోదీ

పాట్నా : రిజర్వేషన్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి సమాచార లోపం ఉందని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. ప్రధాని మోదీ కర్పూరీ ఠాకూర్ను భారత రత్నతో గౌరవించారని, అయితే కర్పూరీ ఠాకూర్ అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.కర్పూరీ ఠాకూర్ తొలిసారి సీఎం పదవి చేపట్టిన వెంటనే సామాజికంగా వెనుకబడిన కులాలన్నింటికీ వారి మతాలతో నిమిత్తం లేకుండా తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. కర్పూరీ ఠాకూర్ నిర్ణయాన్ని తప్పు అని చెప్పడం సరైనదేనా అని ప్రశ్నించారు. ఇక రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, విపక్ష ఇండియా కూటమి మధ్య డైలాగ్ వార్ క్లైమాక్స్కు చేరింది. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్ సహా విపక్ష నేతలు ప్రచారం సాగిస్తుండగా రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ సహా కాషాయ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos