తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    శ్రీశైలం : భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. భక్తులు తెల్లవారు జాము నుంచే పాతాళగంగ (కృష్ణానది)లో స్నానాలు చేసి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. మల్లికార్జున స్వామి అలంకార దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నది.

    READ MORE
  • ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్

    విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగురవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్ట పరమైన చర్య లుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో

    READ MORE
  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • రేపు మంత్రి వర్గ సమావేశం

    హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రగతి భవన్‌లో జరుగనుంది. శాసన సభలో త్వరలో ప్రవేశపెట్టనున్న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. కొత్తగా పది మంది మంత్రి వర్గంలో చేరిన తర్వాత జరుగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా కొత్త మంత్రులకు సీఎం శాఖలను కేటాయించారు. ఈటల రాజేందర్‌- వైద్య, ఆరోగ్యం, వేముల ప్రశాంత్‌ రెడ్డి-

    READ MORE
  • చంద్రబాబు, మమతపై కిషన్ రెడ్డి ధ్వజం

    హైదరాబాద్‌ : పుల్వమాలో ఉగ్ర దాడిపై ఆంధ్ర, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీలు మాట్లాడుతున్న తీరు తోడు దొంగలను తలపిస్తోందని బీజేపీ సీనియర్‌ నాయకుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు దాడి జరగడంపై అనుమానాలున్నాయంటూ మమతా బెనర్జీ చెప్పడం, దానికి చంద్రబాబు వత్తాసు పలకడం చూస్తుంటే … ప్రపంచానికి వీరు ఏ సంకేతం ఇవ్వదలచుకున్నారని ప్రశ్నించారు. వీరి మాటలు దేశ గౌరవానికి భంగం కలిగే విధంగా ఉన్నాయని విమర్శించారు.

    READ MORE
  • తెలంగాణ సంక్షేమ పథకాలకు ప్రశంసలు

    హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే. సింగ్‌ కితాబునిచ్చారు. జూబిలీ హాలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పథకాన్ని అభినందిస్తూ, ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచుకుంటూ పోవడం శుభ పరిణామమన్నారు. సొంత పన్నుల రాబడిలో వృద్ధి రేటు బాగుందన్నారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు