తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    శ్రీశైలం : భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. భక్తులు తెల్లవారు జాము నుంచే పాతాళగంగ (కృష్ణానది)లో స్నానాలు చేసి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. మల్లికార్జున స్వామి అలంకార దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నది.

    READ MORE
  • ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్

    విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగురవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్ట పరమైన చర్య లుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో

    READ MORE
  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • మరో రెండు కొత్త జిల్లాలు

    హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో 31 జిల్లాలు ఉండగా తాజాగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబరు 31న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి ఆధారంగా 11 మండలాలతో నారాయణపేట జిల్లా,

    READ MORE
  • 19న తెలంగాణ కేబినెట్ విస్తరణ

    హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కేసీఆర్ కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. అనంతరం మంత్రుల ప్రమాణస్వీకారంపై ప్రకటన వెలువడింది.

    READ MORE
  • అమెరికాలో అమ్మ భాషకు నీరాజనం

    పుట్టిన గడ్డపైనే పాలకులు అమ్మ భాషను అంతమొందిస్తుండగా తేట తెలుగులోఅక్షరాభ్యాసాన్ని చేసి, ఇతరుల కంటే ఎంతో ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించి ఉపాధికోసం విదేశాలు చేరిన తెలుగు బిడ్డలు అక్కడే అమ్మ  భాష పురోగతికి, తమ వారసులకు పదింగా అందించేందుకు చంద్రునికో నూలుపోగులా సేవ చేస్తున్నారు. కాలిఫోర్నియ విశ్వవిద్యాలయంలో స్థాపించిన తెలుగు పీఠాన్ని బలోపేతం చేసేందుకు అమెరికాలోని తెలుగు బిడ్డలు మరో ఐదు వేల డాలర్లు విరాళంగా ఇచ్చారు. దీంతో తెలుగు పీఠం శాశ్వత నిధి  మొత్తం ఐదు

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు