ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బందిపై వేటు!

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బందిపై వేటు!

న్యూ ఢిల్లీ : విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో ఇటీవల మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 25 మంది క్రూ సిబ్బందిని సంస్థ తాజాగా తొలగించింది. సంస్థ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణం వారిని తొలగిస్తున్నట్టు పేర్కొంది. సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ పేర్కొంది. సంస్థ మరిన్ని తొలగింపులు చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కాగా మంగళవారం ఒకేసారి 300 మంది విమానం క్రూ (సిబ్బంది) అనారోగ్య సెలవులు పెట్టడంతో ఏకంగా 100కి పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. ఫలితంగా, మంగళ బుధవారాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బంద్ది పడ్డ విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos