కాలితో తన్నాడు… సున్నిత భాగాలపై కొట్టాడు.. దాడి ఘటనపై స్వాతి మలివాల్‌

కాలితో తన్నాడు… సున్నిత భాగాలపై కొట్టాడు.. దాడి ఘటనపై స్వాతి మలివాల్‌

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ కు శుక్రవారం ఇక్కడి ఎయిమ్స్లో దాదాపు మూడు గంటల పాటు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు తేలింది. దాడి ఘటనపై స్వాతి మలివాల్ దాఖలు చేసిన ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు బిభవ్ను నిందితుడిగా కేసు నమోదు చేశారు. నిందితుడు బిభవ్ కుమార్ తన సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని, కాలితో తన్ని, కర్రతో బాధినట్లు, కడుపు పైనా తన్నినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆరోపించారు. . దాడి వ్యవహారంపై మలివాల్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని, తన పట్ల జరిగింది తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. గడిచిన కొన్ని రోజులు తనకు చాలా కఠినమైనవని, తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించారని, వారికి కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos