అమెరికాలో అమ్మ భాషకు నీరాజనం

అమెరికాలో అమ్మ భాషకు నీరాజనం

పుట్టిన గడ్డపైనే పాలకులు అమ్మ భాషను అంతమొందిస్తుండగా తేట
తెలుగులోఅక్షరాభ్యాసాన్ని చేసి, ఇతరుల కంటే ఎంతో ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించి ఉపాధికోసం
విదేశాలు చేరిన తెలుగు బిడ్డలు అక్కడే అమ్మ  భాష
పురోగతికి, తమ వారసులకు పదింగా అందించేందుకు చంద్రునికో నూలుపోగులా సేవ చేస్తున్నారు.
కాలిఫోర్నియ విశ్వవిద్యాలయంలో స్థాపించిన తెలుగు పీఠాన్ని బలోపేతం చేసేందుకు అమెరికాలోని
తెలుగు బిడ్డలు మరో ఐదు వేల డాలర్లు విరాళంగా ఇచ్చారు. దీంతో తెలుగు పీఠం శాశ్వత నిధి  మొత్తం ఐదు లక్షల డాలర్లకు చేరిందని అమెరికా వంగూరు
పౌండేషన్‌ స్థాపకులు వంగూరి చిట్టెన్‌ రాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాశ్వత
నిధిని బలేపేతం చేయాలని పదహైదు వేల మందికి పిలుపు నివ్వగా పదహైదు మంది స్పందించారని
పేర్కొన్నారు. వితరణశీలురకు ధన్య వాదాలు తెలిపారు.  ప్రవాసాంధ్రుల నుంచి తెలుగు పాలకులు స్పూర్తి తెచ్చుకుని
అమ్మ  భాష గొంతు నులమకుండా పదికాలాల పాటు పచ్చగా
ఉండేలా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.    

తాజా సమాచారం

Latest Posts

Featured Videos