రేపు మంత్రి వర్గ సమావేశం

రేపు మంత్రి వర్గ సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం గురువారం
సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రగతి భవన్‌లో జరుగనుంది. శాసన
సభలో త్వరలో ప్రవేశపెట్టనున్న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది.
కొత్తగా పది మంది మంత్రి వర్గంలో చేరిన తర్వాత జరుగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా కొత్త మంత్రులకు సీఎం శాఖలను కేటాయించారు.

ఈటల రాజేందర్‌- వైద్య, ఆరోగ్యం, వేముల ప్రశాంత్‌ రెడ్డి- రవాణా, రోడ్లు భవనాలు, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి- విద్యాశాఖ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి- వ్యవసాయశాఖ, తల సాని శ్రీనివాస్‌యాదవ్‌- పశుసంవర్థకం, కొప్పుల ఈశ్వర్‌- సంక్షేమం, ఎర్రబెల్లి దయాకర్‌రావు- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి- న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం, వి. శ్రీని వాస్‌గౌడ్‌- ఎక్సైజ్‌, పర్యాటకం, క్రీడలు, చామకూర మల్లారెడ్డి- కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివద్ధి శాఖలు. కీలక శాఖలైన  ఆర్థిక, ఇరిగేషన్‌, రెవెన్యూ, విద్యుత్‌, మున్సిపల్‌, ఐటీలతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను కేసీఆర్‌ తన వద్దే ఉంచుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos