ఈసారి దేశంలో మార్పు ఖాయం?

ఈసారి దేశంలో మార్పు ఖాయం?

విజయవాడ: దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా?.. లేదా?, వచ్చే పరిణామాలు తట్టుకుంటాయా?.. లేదా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం దేశంలో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అనేక దారుణాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా.. వాటిని అందుకున్నట్లు కూడా రాసివ్వని పరిస్థితినెలకొందన్నారు. సీబీఐ, ఈడీ నేడు కేవలం రాజకీయ కోణంలోనే పని చేస్తున్నాయని విమర్శించారు.మోదీ నియంతృత్వ విధానాల వల్ల స్వాతంత్ర్యం తరువాత ఇంత నిరుద్యోగం ఎప్పుడూ దేశంలో చూడలేదన్నారు. నేడు ప్రతి కుటుంబం అప్పులు చేసి పోషించుకోవాల్సిన దుస్థితి కల్పించారన్నారు. పేదలు మరింత పేదలుగా మారిపోతుండగా, ధనికులు మరింత ధనవంతులుగా పెరుగుతున్నారన్నారు. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేక బతుకు తెరువు భారం బాగా పడుతుందన్నారు. ఇదంతా మోదీ నియంతృత్వ విధానాలే కారణమనేది తమ పార్టీ అభిప్రాయమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలపై మోదీవైపు నుంచి స్పందనే లేదని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సభల్లో కూడా మోదీ ప్రస్తావించలేదన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos