లష్కరే కమాండర్‌ సహా ముగ్గురు ముష్కరులు హతం

లష్కరే కమాండర్‌ సహా ముగ్గురు ముష్కరులు హతం

శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని కుల్గాంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు. వారిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్వాంటెడ్ టెర్రరిస్టులు, లష్కరె తొయిబా కమాండర్ ఉన్నారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఉగ్రవాదులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సోమవారం రాత్రి కుల్గాంలోని రెద్వాని పయీన్ ప్రాంతంలో భద్రతా బలకాలు గాలింపు ప్రారంభించాయి. సుమారు 40 గంటలపాటు సాగిన ఆపరేషన్ బుధవారం రాత్రి ముగిసింది. ఈసందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఘటనా స్థలంలో ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. మృతుల్లో లష్కరే కమాండర్ బాసిత్ అహ్మద్ దార్, అదే ఉగ్ర సంస్థకు చెందిన మోమిన్ గుల్జార్, ఫహిమ్ అహ్మద్ బాబా ఉన్నారని చెప్పారు. భద్రాతా సిబ్బంది, సాధారణ ప్రజల హత్యల్లో బాసిత్ అహ్మద్ పాలుపంచుకున్నాడని పేర్కొన్నారు. కాగా, ఈ ముగ్గురు 18 హత్య కేసుల్లో నిందుతులుగా ఉన్నారని, ఇది తమకు భారీ విజయమని కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిర్దీ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos