ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌ను నేనే

ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌ను నేనే

బెంగుళూరు: ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అశ్లీల వీడియోల రిలీజ్ వెనుక హెచ్డీ కుమారస్వామి హస్తం ఉన్నట్లు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ఆ ఆరోపణలను మాజీ సీఎం కుమారస్వామి ఖండించారు. దీనిపై జేడీఎస్ నేత స్పందిస్తూ.. అవును, ప్రొడ్యూసర్, డైరెక్టర్ను, యాక్టర్ను, అన్నీ తాను అని కుమారస్వామి అన్నారు. ఇలాంటి కథలన్నీ సినిమాల్లో ఉంటాయన్నారు. మీదగ్గర ఏదైనా ఉంటే చెప్పండి అంటూ పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎపిసోడ్ వెనుక తన పాత్ర ఉన్నట్లు శివకుమార్ ఆరోపిస్తున్నారని, అతనికి తోచింది అతను చెప్పనివ్వండి, కానీ సరైన సమయంలోనే ఆ విషయంపై స్పందిస్తానని కుమారస్వామి తెలిపారు. వందల మంది మహిళల్ని వేధించినట్లు ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అతను ఆచూకీలేడు. విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇక ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ.. ఓ కేసులో అరెస్టు అయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos