తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

హైదరాబాద్ : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం వాయు గుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో ఇది తీవ్ర వాయు గుండంగా మారే అవకాశం ఉందని, తదుపరి 48 గంటల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో రేపు పలు చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలోని చాలా చోట్ల వర్షం పడే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos