గోదావరిని చూసి పులకించా…

గోదావరిని చూసి పులకించా…

ధర్మపురి : కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా గోదావరి నదిని చూసి పులకించిపోయానని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం మేడిగడ్డ, సుందిళ్ల జలాశయాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో పంపు హౌస్‌ ఒక్కో ప్రాజెక్టుతో సమానమని తెలిపారు. గత ప్రభుత్వాల  విధానాలను అనుసరించి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం 20-25 ఏళ్లు పట్టేదని చెప్పారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు కష్టించి పని చేసిన ఇంజనీరింగ్‌, నీటి పారుదల సిబ్బందిని అభినందించారు. గోదావరి నదిలోనే వంద టీఎంసీల నీరు నిండు కుండలా సజీవంగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా 400 టీఎంసీలను వాడుకుంటామని వివరించారు. జూన్‌ నుంచి నవంబరు వరకు అరవై టీఎంసీలు, నవంబరు నుంచి జూన్‌ వరకు నలభై టీఎంసీలు ఎత్తిపోస్తామని ఆయన వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos