పతంజలికి మరో షాక్‌

పతంజలికి మరో షాక్‌

న్యూ ఢిల్లీ: ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి కి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన సుమారు 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డ్రగ్స్ లైసెన్సింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధారణ కావడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పతంజలి ఆయుర్వేద దివ్య ఫార్మసీ రూపొందించిన దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రొన్కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ ఉత్పత్తులను లైసెన్స్ విభాగం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మిథిలేశ్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు అఫిడ్విట్ను సమర్పించా

తాజా సమాచారం

Latest Posts

Featured Videos