రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలు చెమటలు పుట్టిస్తున్నాయి. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితులతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఎండ కేవలం మనుషులకే కాదు వాహనాలను సైతం బేజారెత్తేలా చేస్తుందని ఆటో మొబైల్ రంగ నిపుణులు, మెకానిక్లు చెబుతున్నారు. వాహనాలను బయట వదిలితే.. అవి కొద్దికాలంలోనే రంగు, రూపు కోల్పోవడమే కాకుండా తరుచూ మరమ్మతులకు గురికావాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కార్ల వంటి వాహనాల లోపలి భాగాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయంటున్నారు. వాహనాలు అసలు రంగు, మెరుపును కోల్పోతాయి. టైర్లు, సీట్లు, బ్యాటరీ, ఇంజిన్ లోపలి సున్నిత బాగాలు దెబ్బతింటాయి. ఇంధనం ఆవిరయ్యే ఆస్కారముంటుంది. కార్లలో ప్రమాదాల్లో కాపాడే ఎయిర్ బ్యాగ్లు కూడా దెబ్బతింటాయి. సీట్ల కుషన్లు, కవర్లు, అద్దాలు బలహీనమవుతాయని మెకానిక్లు చెబుతున్నారు. రోజుల తరబడి ఎండలో నిలిపితే కార్ల బాడీ కూడా దెబ్బతింటుంది.

ఎండలో వాహనాలను నిలపాల్సి వస్తే తరుచూ వాటిని నీటితో శుభ్రం చేయడం, అద్దాలకు అడ్డుగా ప్యాడ్లను కట్టడం, మొత్తం వాహనాన్ని చుడుతూ కవర్లు బిగించడం ఉత్తమం. ఎండాకాలంలో ప్రతీ వాహనదారుడు కచ్చితంగా తరుచూ టైర్లు, బ్యాటరీలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం తప్పనిసరని ఆటో మొబైల్ నిపుణులు నాయుడు తెలిపారు. ఎండ నుంచి రక్షణ కల్పించే కోటెడ్ వ్యాక్స్ వాడటం మంచిదని తెలిపారు. అలాగే ఫిల్మ్ కూడా అందుబాటులో ఉంది. అవకాశం ఉంటే తప్పనిసరిగా వాహనాన్ని నీడలో నిలిపే ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రతీరోజు తరుచూ శుభ్రం చేయాలి. ఎక్కువ కాలం ఎండలో నిలిపిన వాహనాలను తిరిగి వినియోగించేటప్పుడు విధిగా టైర్లలో గాలి చెక్ చేసుకోవాలని సూచించారు.

అలాగే బ్యాటరీ, ఇంధన ట్యాంకులు కూడా సరి చూసుకోవాలని చెప్పారు. అంతేకాదు ఉష్ణోగ్రతల కారణంగా కార్లలో ఇటీవల మంటలు వ్యాపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ అమరికల కారణంగా ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో వాహనాల బాడీ స్టీల్తో నిర్మించేవారు. ప్రస్తుతం వేగంగా దూసుకెళ్లేందుకు, మైలేజీ పెంచేందుకు ఫైబర్, ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల కార్లు త్వరగా దగ్ధమవుతున్నాయి. నాసి రకం ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించడం కూడా ప్రమాదాలకు తావిస్తున్నాయి. సామార్థ్యానికి మించి లోడ్ పడినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos