తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • వైసిపి మేనిఫెస్టోను విడుదల

    అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని

    READ MORE
  • కిరణ్ కుమార్ రెడ్డి ఆ పనిచేసి ఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు

    నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరించారని విమర్శించారు. అప్పటి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహక రించారని దుయ్యబట్టారు. అలాంటి చంద్రబాబు, కిరణ్

    READ MORE
  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • ఆటోడ్రైవర్ తాగుడు చూసి గుడ్లు తేలేసిన పోలీసులు..

    వారాంతం వచ్చిందంటే చాలు మందుబాబుల మనసులు ఆరోజు ఉదయం నుంచే బార్ల వైపు పరుగులు పెడుతుంటాయి.సాయంత్రం వరకు ఎలాగో ఓపిక పట్టి ఆరు దాటగానే పరుపరుగన బార్లలో వాలిపోయి చుక్కేస్తేగానీ మనసు ఊరుకోదు.అక్కడివరకు బాగానే ఉంటుంది కానీ అటుపైనే మందుబాబులకు అసలు సినిమా మొదలవుతుంది.రాత్రి వేళల్లో రోడ్లపై పోలీసులు నిర్వహించే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతూ అడ్డంగా బుక్కవుతూ వేల రూపాయాల జరిమానాల రూపంలో వదలించుకుంటున్నారు.అయినప్పటికీ మందుబాబుల్లో ఏమాత్రం మార్పు రావడం

    READ MORE
  • మీకు మాలాగా జరగదులే..

    హైదరాబాద్‌లో హత్యాచారానికి గురైన దిశ తల్లిదండ్రులకు సత్వర న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. “హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ హత్యాచారం అత్యంత దారుణం. మా బిడ్డ విషయంలో మేము ఏడేళ్లుగా పోరాడుతూనే ఉన్నాము. కానీ, దిశ విషయంలో న్యాయం త్వరితగతిన జరుగుతుంది. నాటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి” అని దిశ తల్లిదండ్రులను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. కాగా, న్యూఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో ఆశాదేవి కుమార్తె (23)ను ఆరుగురు దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారు. 2012 డిసెంబర్

    READ MORE
  • వీడియో తీసిన కానిస్టేబుల్ సస్పెండ్‌..

    దిశ హత్యకేసులో నిందితుల వీడియోను చిత్రీకరించి, దాన్ని బయటకు పంపిన కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తీసుకు వచ్చిన తరువాత వారు జైల్లో నిలబడివున్న వీడియో మీడియాకు లభించింది. ఈ వీడియోను రవి అనే కానిస్టేబుల్ తన మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన రవిపై చర్యలు తీసుకోవాలని సీపీలు సజ్జన్నార్, మహేశ్ భగవత్ లకు చర్లపల్లి జైలు అధికారులు సిఫార్సు చేశారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు