వీడియో తీసిన కానిస్టేబుల్ సస్పెండ్‌..

వీడియో తీసిన కానిస్టేబుల్ సస్పెండ్‌..

దిశ హత్యకేసులో నిందితుల వీడియోను చిత్రీకరించి, దాన్ని బయటకు పంపిన కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తీసుకు వచ్చిన తరువాత వారు జైల్లో నిలబడివున్న వీడియో మీడియాకు లభించింది. వీడియోను రవి అనే కానిస్టేబుల్ తన మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడుపోలీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన రవిపై చర్యలు తీసుకోవాలని సీపీలు సజ్జన్నార్, మహేశ్ భగవత్ లకు చర్లపల్లి జైలు అధికారులు సిఫార్సు చేశారు. దీంతో కానిస్టేబుల్ రవిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభమైంది. ఇదే సమయంలో రవిని సస్పెండ్ చేస్తున్నట్టు సైబరాబాద్ కమిషనరేట్ ప్రకటనలో తెలిపింది. ఇటువంటి వీడియోలు బయటకు రావడం, వాటిని మీడియాలో విస్తృతంగా చూపడం వల్ల కోర్టులో కేసు బలహీనమవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos