ఆటోడ్రైవర్ తాగుడు చూసి గుడ్లు తేలేసిన పోలీసులు..

ఆటోడ్రైవర్ తాగుడు చూసి గుడ్లు తేలేసిన పోలీసులు..

వారాంతం వచ్చిందంటే చాలు మందుబాబుల మనసులు ఆరోజు ఉదయం నుంచే బార్ల వైపు పరుగులు పెడుతుంటాయి.సాయంత్రం వరకు ఎలాగో ఓపిక పట్టి ఆరు దాటగానే పరుపరుగన బార్లలో వాలిపోయి చుక్కేస్తేగానీ మనసు ఊరుకోదు.అక్కడివరకు బాగానే ఉంటుంది కానీ అటుపైనే మందుబాబులకు అసలు సినిమా మొదలవుతుంది.రాత్రి వేళల్లో రోడ్లపై పోలీసులు నిర్వహించే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతూ అడ్డంగా బుక్కవుతూ వేల రూపాయాల జరిమానాల రూపంలో వదలించుకుంటున్నారు.అయినప్పటికీ మందుబాబుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.తాజాగా హైదరాబాద్లోని మల్కాజిగిరికి చెందిన వి.రాజు అనే ఆటో డ్రైవర్ పోలీసులు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. అతడికి శ్వాస పరీక్ష నిర్వహించిన పోలీసులకు మూర్ఛ వచ్చినంత పనైంది. అతని రక్తంలో ఆల్కహాల్ శాతం ఏకంగా 490 పాయింట్లు దాటడంతో పోలీసులు షాకయ్యారు.నిజానికి రక్తంలో ఆల్కహాల్ శాతం 40 పాయింట్లు మించితే కేసు నమోదు చేస్తారు. 100 పాయింట్లు దాటితే తీవ్రంగా పరిగణిస్తారు. అలాంటిది ఏకంగా 490 పాయింట్లు దాటడంతో అతడిని ఏమనాలో కూడా పోలీసులకు పాలుపోలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజును మల్కాజిగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. నిన్న కేసును విచారించిన కోర్టు అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos