బీజేపీ, కాంగ్రెస్​లకు ఈసీ నోటీసులు

బీజేపీ, కాంగ్రెస్​లకు ఈసీ నోటీసులు

న్యూ ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, వారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. దీనిపై వివరణ తీసుకుని అందించాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటలలోగా తమకు వివరణ అందజేయాలని ఆదేశించింది.
హుందాగా ఉండేలా చూడండి
తమ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల కోడ్ కు అనుగుణంగా, హుందాగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మోడీ, రాహుల్ గాంధీలపై వచ్చిన ఫిర్యాదుల కాపీలను కూడా అందజేసింది.
మోడీ ఏం వ్యాఖ్యలు చేశారు?
ఇటీవల రాజస్థాన్ లోని బన్స్వారాలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోడీ.. ‘‘దేశంలో మహిళల వద్ద ఉన్న బంగారం లెక్కలు తీస్తామని.. సమానంగా పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. మరి వాళ్లు ఎవరికి పంచుతారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశ ఆస్తులపై ముస్లింలకే తొలి హక్కు ఉంటుందని చెప్పింది. అంటే వాళ్లు ఎవరికి పంచుతారో అర్థమవుతోంది. ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకు పంచుతారు. చొరబాటుదారులకు పంచుతారు. మీరు దీనికి ఒప్పుకొంటారా..?” అని ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు జాతి విద్వేషాన్ని పెంచేలా ఉన్నాయంటూ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos