మేలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..!

మేలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..!

న్యూఢిల్లీ : తూర్పు, ఈశాన్య భారత్లో ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్ధాయిలో నమోదయ్యాయి. 1901 నుండి దక్షిణ భారత్లో రెండవ అత్యధికమని పేర్కొంది. గత నెల సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దాదాపు రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. మేనెలలో కూడా అత్యధిక రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఐఎండి అంచనావేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీల్లో సాధారణం కన్నా అధిక రోజులు వడగాడ్పులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.
బంగాళాఖాతం నుండి తేమతో కూడిన సముద్రపు గాలిని నిరోధించే, ఇతర సంవత్సరాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన యాంటిసైక్లోన్ అని పిలవబడే ఎల్నినో, వాతావరణ వ్యవస్థ మిశ్రమ ప్రభావం కారణంగా ఈ రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండి డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర తెలిపారు.తూర్పు, ఈశాన్య భారతదేశంలో సగటు ఉష్ణోగ్రతలు 28.1 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్ కాగా, రెండూ సాధారణం కంటే దాదాపు రెండు డిగ్రీలు అధికంగా ఉన్నాయని అన్నారు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత లలో అసాధారణ పెరుగుదల కనిపించింది. ఉదాహరణకు పశ్చిమబెంగాల్లోని పన్ఘర్లో 45.6 డిగ్రీల సెల్సియస్ కాగా, సాధారణం కన్నా 10 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. పశ్చిమబెంగాల్లోని కలైకుండ్లో 47.2 డిగ్రీలు కాగా, సాధా రణం కన్నా 10.4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
దక్షిణ భారతదేశంలో సగటు ఉష్ణోగ్రతలు 37.25 డిగ్రీల సెల్సియస్ లేదా సాదారణం కంటే దాదాపు 1.35 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. ఇది 1901లో ఆల్టైం రికార్డు స్ధాయి తర్వాత 2016లో నమోదైన 37.57 డిగ్రీల సెల్సియస్ కంటే కొంచెం తక్కువ అని ఐఎండి తెలిపింది.ఒడిశాలో అత్యధికంగా 18 వడగాడ్పుల రోజులు ఉండగా, పశ్చిమబెంగాల్లో 16 రోజులు, కర్ణాటక, తమిళనాడు, కేరళలు వరసగా 8, 7, 5 వడగాడ్పులు రోజులు నమోదయ్యాయి. భారత్లోని 36 వాతావరణ ఉప విభాగాలలో ఏప్రిల్లో సగటున 71 వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. ఈ ఏప్రిల్ 118 వడగాల్పుల రోజులతో 2010 నుండి మూడవ అత్యధికంగా నమోదైంది. 2010 ఏప్రిల్లో అత్యధికంగా 337 వడగాల్పుల రోజులతో మొదటిస్థానంలో ఉండగా, 197 వడగాల్పుల రోజులతో 2022 ఏప్రిల్ 198 వడగాల్పుల రోజులతో రెండో స్థానంలో ఉంది.

తాజా సమాచారం