తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • ప్రధానిపై ఏపీ కాంగ్రెస్ చార్జిషీట్

    అమరావతి:పదేళ్ల పాలనలో దేశంలోని అన్నివర్గాల వారినీ మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల చార్జిషీట్ విడుదల చేశారు. ప్రధానిగా మోదీ పది ఫెయిల్యూర్లను ఎత్తిచూపుతూ దీనిని రూపొందించినట్లు చెప్పారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి ఏపీ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో

    READ MORE
  • మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!

    హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అడిగారు. మోదీని కేటీఆర్ ఏమేం ప్రశ్నలు అడిగారంటే.. ‘‘దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..! దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి.. ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి. ఒక్క తెలంగాణ సాగునీటి

    READ MORE
  • షర్మిలపై కేసు నమోదు..

    కడప: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును

    READ MORE
  • నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు

    హైదరాబాదు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది

    READ MORE
  • ఎన్‌కౌంటర్‌ వ్యాఖ్యల పై నారాయణ యూటర్న్‌..

    దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నాయారణ యూటర్న్‌ తీసుకున్నారు.దిశ ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని ఎన్‌కౌంటర్లకు పార్టీ వ్యతిరేకం కావున నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు.ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌పై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. న్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ పార్టీ తీర్మానం కూడా చేసింది. అందువల్లే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. అదే

    READ MORE
  • కాల్పులతో అత్యాచారాలు ఆగవు

    వరంగల్: అత్యాచారాల నిరోధానికి ఎదురు కాల్పులు పరిష్కారం కాదని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. ఎదురు కాల్పులతో సమస్యలు తీరవని చెప్పారు. హన్మకొండలో శనివారం జరిగిన తెజస ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘అత్యాచారాలు, హత్యలు తదితర నేరాలను అరికట్టాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. వరంగల్ యువతిపై జరిగిన హత్యాచారంపై వెంటనే విచారణ జరిపించాలి. మృతురాలి కుటుంబా న్ని ఆదుకోవాలి. దిశ తరహా ఘటనలు మళ్లీ జరుగకుండా ప్రభుత్వం

    READ MORE
  • రెండు ఘటనల్లో సాక్ష్యం సత్యమే..

    గతనెల 27వ తేదీన హైదరాబాద్‌ నగర శివార్లలో జరిగిన దిశ హత్యాచారం అనంతరం నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.అయితే ఈ రెండు ఘటనల్లో ఒక విచిత్రం తాజాగా వెలుగు చూసింది.రెండు ఘటనల్లో మొదట మృతులను చూసింది పాలు వ్యాపారం చేసే సత్యం అనే ఒకే వ్యక్తి కావడం గమనార్హం.దిశను నిందితులు సజీవదహనం చేసిన రోజున ఉదయం ఐదు గంటల వేళలో పొలానికి వెళుతున్న సత్యం మంటను చూసి చలి మంటగా భావించారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు