తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    శ్రీశైలం : భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. భక్తులు తెల్లవారు జాము నుంచే పాతాళగంగ (కృష్ణానది)లో స్నానాలు చేసి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. మల్లికార్జున స్వామి అలంకార దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నది.

    READ MORE
  • ఎన్టీఆర్ జిల్లా అంతటా144 సెక్షన్

    విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగురవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్ట పరమైన చర్య లుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో

    READ MORE
  • కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

    విజయవాడ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

    READ MORE
  • ఆ ట్వీట్ ను డిలీట్ చేశా

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ‘మా వాడు, పరాయి వాడు’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తమ హీరోను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ పోస్టును డిలీట్ చేశానంటూ ఒక్క వాక్యంలో వివరణ

    READ MORE
  • తాతయ్యతో కేటీఆర్‌..

    రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలు,ఇష్టాలు ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉండే మంత్రి కేటీఆర్‌ తాజాగా తన తాతయ్యతో కలసి ఉన్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.తన తాతయ్య (అమ్మ తరఫు) ఫొటో పోస్టు చేశారు. “ఈ ఫొటో చూశారా… మా తాతయ్య స్వర్గీయ జె.కేశవరావు గారు. ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు. అనేక పర్యాయాలు జైలుకెళ్లొచ్చారు. ఆయన పట్ల నేనెంతో గర్విస్తుంటాను” అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

    READ MORE
  • వాళ్లను వదలను..

    దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై ప్రజలు,పలు రంగాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తుండగా నిందితుల కుటుంబ సభ్యులు కొంతమంది సోకల్డ్‌ మేధావులు,మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు మాత్రం నిందితులకు మద్దతుగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి న్యాయం చేశారని ప్రజలు,ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తుండగా నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేసి తమకు అన్యాయం చేశారని నిందితుల కుటుంబాలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాయి.అందుకు ఈ మేధావులు,మానవ హక్కుల సంఘాలు,కొన్ని మహిళా సంఘాలు సైతం నిందితుల కుటుంబాల

    READ MORE
  • సజ్జనార్‌పై హత్య కేసు నమోదు చేయండి..

    దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటన చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి.దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ రాజ్యాంగ వ్యతిరేకమంటూ కొంత మంది మేధావులు విమర్శలు చేస్తుండగా ఎన్ కౌంటర్ పై జాతీయ మానవహక్కుల సంఘం విచారణ కూడా జరుపుతోంది.ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై హత్య కేసు నమోదు చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో హైదరాబాదుకు చెందిన ‘నేను సైతం‘ స్వచ్చంద సంస్థ ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు