రాజ్యాంగాన్ని కాపాడండి.. ఓటర్లకు రాహుల్, ఖర్గే అభ్యర్థన

రాజ్యాంగాన్ని కాపాడండి.. ఓటర్లకు రాహుల్, ఖర్గే అభ్యర్థన

ఢిల్లీ: ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి జరుగుతున్నవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇవి సాధారణ ఎలక్షన్లు కావని.. మంగళవారం జరుగుతున్న మూడో దశ పోలింగ్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. రాజ్యాంగంలోని హక్కులను కాలరాస్తున్నవారిని ఓడించాలన్నారు.
హక్కులను కాపాడండి: ఖర్గే
లోక్ సభ మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని.. వాటిని రక్షించేందుకు సరైన పార్టీని గెలిపించాలని ఖర్గే కోరారు. “రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సరైన అభ్యర్థికి ఓటు వేయండి. 93 నియోజకవర్గాలలో 11 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి. తమ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకోవడమే కాకుండా.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు పాటుపడే వారిని ఎన్నుకోండి” అని ఖర్గే తెలిపారు.
11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఇవాళ 11 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అస్సాం (4), బీహార్ (5), ఛత్తీస్గఢ్ (7), దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ (2), గోవా (2), గుజరాత్ (25), కర్ణాటక (14), మహారాష్ట్ర (11), మధ్యప్రదేశ్ (8), ఉత్తరప్రదేశ్ (10), పశ్చిమ బెంగాల్ (4) స్ధానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇవాళే పోలింగ్ జరగాల్సిన గుజరాత్లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos